ETV Bharat / state

గేదె తోక పట్టుకుని నదిలో ఈతట...ఎందుకంటే! - swimming at Krishna river by bufellow tail

కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడం అని హాస్యాస్పదంగా అంటుంటాం! కానీ దివిసీమ ప్రజలు సరిగ్గా అదే చేస్తున్నారు. కానీ ఇక్కడ తోక ఉంది.. కుక్కే లేదు.. గేదె తోక పట్టుకుని కృష్ణానది ఈదుతున్నారు. ఎందుకబ్బా... అనుకుంటున్నారా? మీరే చూడండి

గేద తోకతో నదిలో ఈతకొడుతున్న కాపరులు
author img

By

Published : Nov 24, 2019, 1:24 PM IST

గేదె తోక పట్టుకుని నదిలో వెళ్తున్న కాపరులు

దివిసీమ ప్రజలు ఎన్నో ఏళ్ళ పోరాట ఫలితమే పులిగడ్డ -పెనుమూడి మధ్య కృష్ణానదిపై నిర్మించిన వారధి. ప్రయాణానికి సులువుగా ఉన్నా... వారధి వల్ల పశుగ్రాసానికి ఇబ్బందులు తలెత్తాయి. అందుచేత కృష్ణానది మధ్య పాయల్లో ఇసుక దిబ్బలపై పశుగ్రాసం కోసం పాడి పశువుల్ని తీసుకెళ్లి అవి కడుపారా తిన్న తరువాత గేదె తోక పట్టుకుని ఈదుకుంటూ వస్తున్నారు.

ఒక్కరోజు రెండు రోజులు కాదు గత 15 సంవత్సరాలుగా సుమారు 10 మంది పశువుల కాపరులు కృష్ణానది పాయల మధ్యలో సుమారు కిలోమీటరు దూరం 100 అడుగుల లోతు ఉన్న నదిలో ప్రమాదకరం అని తెలిసినా జీవనం కోసం నదిని దాటుతున్నారు. అడుగు గల నాలుగు థర్మకోల్ ముక్కలను తాడుతో కట్టి దానిని బొడ్డుకింద పెట్టుకుని నీటిపై తేలటానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గేదెలు నది మధ్యలోకి వచ్చి ఎటు వెళ్ళకుండా చాలా సమయం అక్కడే ఉండిపోతాయి అలాంటి సందర్భంలో ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని కాపరులంటున్నారు.

గతంలో తోట్లవల్లూరు దగ్గర గేదెను పట్టుకుని నది దాటుతుండగా వరదలో కొట్టుకొచ్చిన చెట్టు గేదె కాలికి తగిలి వెనక్కి తిరగడంతో అక్కడే మునిగిపోయి ఒక కాపరి మరణించాడు. ప్రభుత్వం తమకు లైఫ్ జాకెట్​లు ఇచ్చి ఆదుకోవాలని కాపరులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

ఈ జైల్లో ఎవరైనా తినొచ్చు..!

Intro:ap_vja_04_24_geda_tokatho_nadhidatutunna_pasukaparulu_pkg_avb_ap1004
kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511.

  పశువుల మేత కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు -  గేద తోకతో కృష్ణానది దాటుతున్నారు.

దివిసీమ ప్రజలు ఎన్నో ఏళ్ళు పోరాట ఫలితం  పులిగడ్డ -పెనుమూడి మధ్య కోట్ల రూపాయలతో కృష్ణానదిపై వారధి నిర్మించారు వారధి నిర్మిస్తే నదిని దాటడం సులువని తెలుసు కాని ఈ వారధి కట్టడం వలన అంతకు ముందు కృష్ణానదిలో  కృష్ణాజిల్లా పులిగడ్డ పల్లెపాలెం నుండి గుంటూరు జిల్లా పెనుమూడి వరకు ప్రతి అరగంటకు ఒక లాంచీ పడవ నడిపేవారు. ఈ పడవ ద్వారా కృష్ణానది మధ్యలో ఉన్న లంక భూముల్లోకి మరియు పశువుల కాపరులు చేరుకునేవారు.   
కృష్ణానది మధ్య పాయల్లో ఇసుక దిబ్బలపై పశుగ్రాసం కోసం పాడి పశువుల్ని నదిలో  దిబ్బలమీదకు కృష్ణానదిలో ఈదుకుంటూ  ఉదయం తీసుకువేలతారు  అవి కడుపారా తిన్న తరువాత సాయంత్రం కృష్ణానదిలో ఈదుకుంటూ  వస్తాయి పశువులే కాకుండా వాటి కాపరులు కూడా గేదె తోక పట్టుకుని ఈదుకుంటూ వస్తారు. ఒక్కరోజు రెండు రోజులు కాదు గత 15 సంవత్సరాలుగా సుమారు 10 మంది పశువుల కాపరులు కృష్ణానది పాయల మధ్యలో సుమారు కిలోమీటరు దూరం సుమారు 100 అడుగుల లోతు ఉన్న నదిలో  ప్రమాదకరం అని తెలిసినా జీవనం కోసం  నదిని దాటుతున్నారు.   అడుగు గల నాలుగు ధర్మాకోల్ ముక్కలు తాడుతో కట్టి దానిని బొద్దుక్రింద పెట్టుకుని నీటిపై తేలటానికి ప్రయత్నం చేస్తున్నారు.   గేదె నదిలో ఈత కొట్టేటప్పుడు కాళ్ళతో నీటిని  బలంగా వెనక్కు పంపడం జరుగుతుందని గేద కాలు తోక పట్టుకున్న అతనికి తగిలితే ఆ బాధతో తోక వదిలి నదిలో మునిగిపోవడం జరుగుతుంది. కొన్ని గేదలు నది మధ్యలోకి వచ్చి ఎటు వెళ్ళకుండా చాలా సమయం అక్కడే ఉండి పోతాయి అలాంటి సందర్బంలో ప్రమాదం జరుగుతుంది.   
గత నెలలో తోట్లవల్లూరు దగ్గర గేద పట్టుకుని నది దాటుతుండగా వరదలో కొట్టుకొచ్చిన చెట్టు గేద కాలికి తగలడంతో గేద వెనక్కి తిరగడంతో అక్కడే మునిగిపోయి మరణించారు. 
ప్రభుత్వం వారు తమకు లైఫ్ జాకెట్ లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.   
 వీడియోలు FTP ద్వారా పంపడమైనది

Body:పశువుల మేత కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు -  గేద తోకతో కృష్ణానది దాటుతున్నారు.

Conclusion:పశువుల మేత కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు -  గేద తోకతో కృష్ణానది దాటుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.