కృష్ణా జిల్లా విజయవాడలో అనుమానాస్పద స్థితిలో ఓ వీఆర్వో మరణించారు. గుడివాడకు చెందిన గొర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి.. విజయవాడలో వీఆర్వోగా విధులు నిర్వర్తింస్తుండేవారు. ఈ నెల 31న శ్రీనివాస్... వార్డు సచివాలయంలోనే నిద్రపోయారు.
మరునాడు ఉదయం పని ఉందని కేబీఎన్ కాలేజ్ దగ్గర కలుద్దామని వార్డు సెక్రటరీకి తెల్లవారుజామున 4.30 గంటలకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ... రైల్వే వెస్ట్ బుకింగ్ కౌంటర్ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించింది. ఒకటో పట్టణ పోలీసులు వీఆర్వో మృతిపై కేసు నమోదు చేసివిచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: