కృష్ణాజిల్లా పుల్లూరులోని అప్పిడి సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కె.టి.వి. హర్షిత్ పాఠశాల సైన్స్ ఫెయిర్లో చేసిన ప్రయోగం అందరినీ అబ్బురపరుస్తోంది. పశువులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రూపొందించిన ప్రయోగం ఉపాధ్యాయులతోపాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మన్ననలు పొందింది.
పంట సమయంలో పక్షులు వచ్చి పంటను నాశనం చేస్తుంటాయి. అలాంటప్పుడు రైతులు పంట కాపు కాయాల్సి ఉంటుంది. అయితే మనుషులు దగ్గర లేకుండా.. పక్షుల్ని తరిమికొట్టే యంత్రాన్ని హర్షిత్ కనిపెట్టాడు. సాంకేతికను ఉపయోగించి ధ్వనిని కలిగిస్తూ యంత్రాన్ని రూపొందించాడు. భవిష్యత్లో మరిన్ని ప్రయోగాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటానని తెలిపాడు.
ఇదీ చదవండి: 'సైనికుల కోసం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్'