కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు క్రాఫ్ట్ పిరియడ్లో తమ పాఠశాల ఆవరణలో...కూరగాయలను సాగు చేస్తున్నారు. ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండిస్తున్నారు. అలాగే వాటిని రోజువారి వంటల్లో వినియోగిస్తున్నారు. అంతేగాక విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించి... పిల్లలు ఇంటి ఆవరణలో ఆకుకూరల సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మా ఉపాధ్యాయలు నిత్యం కొంత ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. అంతేగాక మాతో స్వయంగా కూరగాయలు, ఆకుకూరలను సాగు చేయించారు. పంటలను చీడ పురుగుల నుంచి ఏ విధంగా సంరక్షించుకోవాలి, జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలను ప్రయోగపూర్వకంగా తెలియజేసేవారు. ప్రసుత్తం మేము మా పాఠశాలలో పాలకూర, మెంతికూర, టమోటో, వంగ, సొర, గొంగూర, బచ్చలి కూరలను సాగు చేస్తున్నాము. _ విద్యార్థి
భవిష్యత్ తరాల వారికి క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడని ఆకుకూరలు , మరియు కూరగాయలు పండించటాన్ని నేర్పిస్తున్నాము. జీవామృతం తయారు చేయటం, పురుగుల నివారణా చర్యలు...వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాము . అలాగే ప్రతి పాఠశాలలో న్యూట్రి గార్డెన్ ఎలా తయారు చేసుకోవాలి... మొక్కలను ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. ఇప్పటికే చాలా మంది ఇంటి పెరట్లో అనేక ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. అదేవిధంగా పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించి... పిల్లలు ఇంటి ఆవరణలో కూడా ఈ విధానం అవలంబించేలా చర్యలు తీసుకుంటున్నాము.
-కె .రీతు, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయ విభాగ సభ్యురాలు
ఇదీ చదవండీ...రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే ప్రారంభం