కృష్ణాజిల్లా చల్లపల్లిలో గడ్డివాము దగ్ధం అయ్యింది. వేముల శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన 10 ఎకరాల వాము మంటల్లో చిక్కుకుంది. నిప్పురవ్వలు ఎగసిపడటంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు 50వేల రూపాయల నష్టం జరిగినట్లు బాధితుడు చెప్పారు.
ఇవీ చదవండి.. వ్యాధి లక్షణాలు గుర్తిస్తే.. వెంటనే పరీక్షలు చేయాలి: సీఎం