ETV Bharat / city

వ్యాధి లక్షణాలు గుర్తిస్తే.. వెంటనే పరీక్షలు చేయాలి: సీఎం - కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి తక్షణ పరీక్షలు చేయండి: సీఎం

కుటుంబ సర్వేలో వ్యాధి లక్షణాలు గుర్తించిన వారికి వెంటనే పరీక్షలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. N-95 మాస్కులు తయారీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయరంగ పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. అరటిని స్థానిక మార్కెట్లకు తరలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం.

cm review meeting
cm review meeting
author img

By

Published : Apr 13, 2020, 4:11 PM IST

కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కుటుంబ సర్వేలో వ్యాధి లక్షణాలు గుర్తించిన వారికి పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. ఎయిమ్స్‌ వైద్యులతో మాట్లాడి బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలన్నారు. అనంత, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 400 పడకలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకు 10 వేల పీపీఈలు ఉత్పత్తి చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. ఎన్‌-95 మాస్కులూ అక్కడే తయారయ్యేలా చూడాలన్న సీఎం...సంబంధిత పరిశ్రమ వర్గాలతో మాట్లాడి ఉత్పత్తి చేయాలన్నారు. క్వారంటైన్, ఐసొలేషన్‌ కేంద్రాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

అరటిని స్థానిక మార్కెట్లకు తరలించాలి:సీఎం

రాష్ట్రంలో వ్యవసాయరంగ పరిస్థితులపై సమీక్షించిన ముఖ్యమంత్రి... అరటిని స్థానిక మార్కెట్లకు పంపేందుకు ప్రయత్నించాలని సూచించారు. అలా చేస్తే జనతా బజార్లకు ముందస్తు సన్నాహకం అవుతుందని తెలిపారు. ఎక్కడెక్కడ మార్కెటింగ్‌కు అవకాశం ఉందో మ్యాపింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు.

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి
ఇతర రాష్ట్రాలకు చేపల రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. అసోం, పశ్చిమబంగ, బిహార్‌, యూపీ మార్కెట్లపై కేంద్రంతో మాట్లాడాలన్న సీఎం.. అమెరికా, యూరప్‌కు రొయ్యల ఎగుమతిపై తగిన ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు..
నిత్యావసర వస్తువుల ధరలపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ధరల బోర్డు పెట్టాలని ఆదేశించారు. ఎక్కువ ధరకు అమ్మితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. చికెన్, గుడ్లు, చేపల దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. కష్టకాలంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కార్టులు..
ఎవరైనా రేషన్‌ అడిగితే.. వారి ఇబ్బంది గుర్తించి వెంటనే పరిశీలన చేసి రేషన్‌ ఇవ్వాలని అధికారులకు సీఎం తెలిపారు. విపత్తు నేపథ్యంలో దేన్నైనా ప్రజలకు ఇచ్చే కోణంలోనే అధికారులు ఆలోచన చేయాలన్నారు. అలాగే రేషన్‌ ఇచ్చిన వారందరికీ వేయి రూపాయల సహాయం అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం కార్డులు లేకుండా రేషన్‌ అడుగుతున్న వారి చేత దరఖాస్తు చేయించాలన్న సీఎం...అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:పోలీస్​ ఆర్కెస్ట్రా: లాక్​డౌన్​లో వినోదం హోమ్​ డెలివరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.