విధి నిర్వహణలో ఉన్న కృష్ణా జిల్లా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను కొద్ది రోజుల క్రితం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స, హోం క్వారంటైన్ అనంతరం కోలుకున్నారు. తిరిగి విధులకు హాజరయ్యారు. కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది, తరువాత హోమ్ క్వారంటైన్ లో ఉండి కరోనాను జయించారు.
సోమవారం నుంచి తిరిగి విధులకు హాజరైన సీఐను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ రాంబాబు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది అభినందించి ఘనంగా స్వాగతం పలికారు.
ఇవీ చదవండి: 'నేను రిటైర్డ్ ఐఏఎస్‌ను.. పూజ చేయిస్తా.. డబ్బులివ్వండి'