
సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రవాణాశాఖ కమిషనర్ గా, ఈ ప్రగతి ప్రాజెక్టు పర్యవేక్షకుడిగా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యంను బదిలీల కారణంగా వెయిటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తెదేపా హయాంలో ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్ బాబు ఉండగా... జులై మొదటి వారంలో ఆయన్ను బదిలీ చేసి... ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే మళ్లీ అహ్మద్ బాబుకే ఆర్టీజీఎస్ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ఈ నెల 23న అహ్మద్ బాబును బదిలీ చేసి.. సాంకేతిక విద్య కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.