School buildings: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పైకప్పు బాగా దెబ్బతింది. వర్షాలకు తరగతి గది పైకప్పులో నీటి చెమ్మ దిగి.. పెచ్చులూడి పడుతున్నాయి. విధిలేక విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఆ భవనంలోనే ఉంటున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో విశాఖ మద్దిలపాలెంలోని ఓ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారు. అలాంటి ప్రమాదం ఇక్కడ జరగక ముందే గదులకు మరమ్మతులు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: