ప్రస్తుత రోజుల్లో ముగ్గుల పోటీల్లో తప్పా ఎక్కడా ముగ్గు కోసం గంటల తరబడి సమయం వెచ్చించరు. కానీ కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో రావి సురేష్ ఇంటి ముందు వేసే ముగ్గు కోసం కొన్ని రోజులుగా కష్టపడి అన్ని సిద్ధం చేస్తారు. అందుకే ఆ ముగ్గుకు అంత ప్రత్యేకత. గొబ్బెమ్మలు, బంతి పూలు, అరటి గెలలు, పెద్ద పెద్ద ఉసిరి కొమ్మలు, గాలి పటాలు, రంగు రంగులతో ఈ రంగవల్లి రోడ్డు పై వెళ్లేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది.
గత 12 సంవత్సరాలుగా ఇలాగే సాంప్రదాయ బద్దంగా ముగ్గులు వేస్తున్నామని రావి జయశ్రీ తెలిపారు. ఆవుపేడ ఉపయోగించి గొబ్బెమ్మలు పెట్టడంతో సూక్ష్మ క్రిములు ఇంటిలోకి ప్రవేశించవంటున్నారు. ఇల్లంతా బంతిపూల దండలతో చేసిన అలంకరణ చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఏటా ఈ ముగ్గు వేయటానికి సుమారు రెండు వేలు వరకు ఖర్చు అవుతుందంటున్నారు ఆమె.
ఇవీ చూడండి...