ETV Bharat / state

సమస్యల పరిష్కరం కోసం పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన - sanitation workers protest

కృష్ణాజిల్లా పారిశుద్ధ్య కార్మికులు మోకాళ్లపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. గత 4 నెలల వేతనాలు చెల్లించాలని, ఆరు నెలల ఆరోగ్య అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు ఇచ్చేవరకు విధులకు హాజరుకామని స్పష్టం చేశారు.

protest
మోకాళ్లపై నిలబడి పారిశుద్ధ్య కార్మికుల నిరసన
author img

By

Published : Dec 28, 2020, 1:26 PM IST

కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారం రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పాలకులు, అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో కార్మికుల ఆందోళన ఉద్ధృతం చేశారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి కార్మికులు ఆందోళన చేశారు. 103 మంది కార్మికులు ప్రతిరోజూ ఏదోరకంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గత నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని, ఆరు నెలల ఆరోగ్య అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు ఇచ్చేవరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

కార్మికుల ఆందోళనతో నందిగామలో పారిశుద్ధ్య పనులు ఏడు రోజులుగా నిలిచిపోయాయి. దీనివల్ల పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది. చెత్త కుండీలు చెక్కతో నిండిపోయాయి. రోడ్ల పక్కనే చెత్త పోస్తున్నారు. వీటి వద్ద ఈగలు, దోమలు, పందులుతో మరింత అధ్వాన్నంగా మారింది. వ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంది.

కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, అలవెన్సులు ఇవ్వాలని సీఐటీయూ మండల కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇదీ చదవండి :

కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.