ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అదే సంస్థలో పనిచేసే ఓ డ్రైవర్ లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యాధరపురం డిపోకు చెందిన డ్రైవర్ సూపర్‌వైజర్ పోస్టులు ఇప్పిస్తానని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురిని నమ్మించాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆ ఉద్యోగి ముందుగా రెండున్నర లక్షలు వసూలు చేశాడు. బాధితుల నుంచి ఉద్యోగం కోసం ఒత్తిడి పెరగడంతో నకిలీ అపాయింట్ మెంట్ లెటర్, ఐడీ కార్డులు కూడా ఇచ్చాడు.
మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ కేసును టాస్క్ ఫోర్స్‌కు అప్పగించారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న కాల్ రికార్డులు, పత్రాలు, నకిలీ ఐడీకార్డులను పరిశీలించిన ఆర్టీసీ ఆర్ ఎం నాగేంద్రప్రసాద్ అంతర్గత విచారణకు ఆదేశించారు.
ఇదీ చూడండి..