కృష్ణా జిల్లా పునాదిపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంకిపాడు వైపు నుంచి పామర్రు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతుల వాహనం పునాదిపాడు గ్రామం వద్ద ముందు టైర్ పేలిపోవడంతో.. వారు రహదారిపై పడి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వెంటనే తన వాహనం ఆపి రక్తస్రావం కాకుండా గాయమైనచోట కట్టుకట్టి ప్రథమ చికిత్స అందేలా చూశారు. తన సొంత వాహనంలో దంపతులు ఇద్దరినీ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ప్రాణపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారని బోడె ప్రసాద్ వెల్లడించారు.
ఇదీ చూడండి. 'డీజీపీని చీవాట్లు పెడితే... ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు'