ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి​ స్పందన...దివ్యాంగుడికి దొరికెను చేయూత

ఈటీవీ భారత్​ కథనాలకు వచ్చే స్పందనలో మరో కలికితురాయి చేరింది. కాళ్లులేకుండా కొండపై పాకుతూ...గుట్టలపై నడుస్తూ బతుకు భారంగా జీవిస్తున్న ఓ దివ్యాంగుడిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. స్పందించిన కొందరు యువకులు ఆ దివ్యాంగుడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

author img

By

Published : Mar 9, 2020, 3:19 PM IST

respond to etv bharath story 5000rs helped to victim
దివ్యాంగుడికి ఆర్థికసాయం అందించిన ఫౌండేషన్ సభ్యులు

కృష్ణానదిలో బతుకు భారంగా జీవిస్తున్న గుండు శ్రీనుకు ఈటీవీ భారత్​ కథనంతో కాస్త సాయం దొరికింది. నదిలో జీవనం.. కాళ్లు లేకున్నా కొండరాళ్లపై పయనం అనే శీర్షికతో ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. మన మైత్రి ఫౌండేషన్​ సభ్యులు రాష్ట్రం దాటి మరీ కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ శివారు కృష్ణానదిలో ఉంటున్న శ్రీనుకు ఆర్థిక సాయం చేశారు. నెల్లూరుకు చెందిన 20మంది యువకులు మన మైత్రి ఫౌండేషన్​ పేరుతో తాము సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు వెంకటసాయి తెలిపారు. ప్రభుత్వం స్పందించి శ్రీనుకు మూడు చక్రాల వాహనం, ఇంటి స్థలం ఇవ్వాలని వెంకటసాయి కోరుతున్నారు.

ఇదీ చూడండి మమ్మల్ని చావనివ్వండి... మా వాల్ల ఎవరికీ లాభం లేదు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.