Cricket LED Stumps Cost : అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ క్రికెట్‌లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా బెయిల్స్ కొట్టినప్పుడల్లా వెలిగే ఎల్‌ఈడీ స్టంప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ హై-టెక్ స్టంప్‌లు మ్యాచులో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో అంపైర్‌లకు సహాయపడతాయి. ఇంతకీ ఈ ఎల్‌ఈడీ స్టంప్‌ల ధర ఎంతో తెలుసా?
ఎల్‌ఈడీ స్టంప్స్ అంటే ఏంటి?
క్రికెట్‌లో సాధారణంగా ఉపయోగించే చెక్కతో చేసిన వికెట్ల స్థానంలో మోడర్న్ ఎల్‌ఈడీ స్టంప్‌లు వచ్చాయి. వీటిలో ఎల్‌ఈడీ లైట్లు, టచ్-సెన్సిటివ్ సెన్సార్‌లు ఉంటాయి. ఇవి బాల్ స్టంప్‌లకు తగిలిన వెంటనే లేదా బెయిల్స్ తొలగినప్పుడల్లా వెలుగుతాయి. కొన్ని మోడళ్లలో చిన్న కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ టెక్నాలజీ మ్యాచ్‌లో అంపైర్లు త్వరగా, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని సులభతరం చేసింది.
ఈ స్టంప్‌లను ప్రధానంగా జింగ్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు తయారు చేస్తున్నాయి. వీటిని ఐసీసీ ప్రపంచ కప్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి ప్రధాన టోర్నమెంట్‌లలో ఉపయోగిస్తారు. ఉపయోగించబడతాయి.
ఎల్‌ఈడీ స్టంప్‌ల ధర ఎంత?
LED స్టంప్‌ల ధర చాలా ఎక్కువ. బెయిల్స్‌తో పాటు స్టంప్‌ల ధర $40,000 నుంచి $50,000 ఉంటుంది. అంటే దాదాపు రూ.30 నుంచి రూ.40 లక్షలని ట్రేడ్ వర్గాల అంచనా. వీటిలో ఉపయోగించిన మెటీరియల్, టెక్నాలజీ, అత్యధిక వేగంతో వచ్చిన బాల్ తగిలినా తట్టుకొనే సామర్థ్యంతో ధర ఎక్కువగా ఉంది.
ఐపీఎల్ లేదా వన్డే ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌ల కోసం, క్రికెట్ బోర్డులు సాధారణంగా ఈ స్టంప్‌లను పూర్తిగా కొనుగోలు చేయకుండా అద్దెకు తీసుకుంటాయి. ఉదాహరణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2021, 2022లో ఐపీఎల్ టోర్నీ కోసం స్టంప్‌లను అద్దెకు తీసుకొంది. ఇందుకు ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.1.60 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఎల్‌ఈడీ స్టంప్‌ల వల్ల క్రికెటర్లు ఎదుర్కొనే సవాళ్లు
LED స్టంప్‌లు గేమ్‌ను మెరుగుపరిచినప్పటికీ, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రధాన ఆందోళనల్లో ఒకటి మన్నిక. స్టంప్‌లు వేగవంతమైన డెలివరీల ప్రభావాన్ని తట్టుకోవలసి ఉంటుంది. ఇవి విరిగిపోతే భర్తీ చేయడం ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమని క్రికెట్ నిర్వకుల వాదన.
కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ధరించే సన్ గ్లాసెస్ ధర అంతా? - Kohli Oakley sunglasses Price
ఒలింపిక్స్ పిస్టల్ ధర రూ.కోటి! - మను బాకర్ రియాక్షన్ ఇదే - Manu Bhaker Reacted on PIstol Price