ETV Bharat / state

పాత టికెట్ల దందా... అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం - durga temple news

కృష్ణా జిల్లాలోని ఇంద్రకీలాద్రిపై పాత దర్శనం టిక్కెట్లను రీసైక్లింగ్​ చేస్తూ.. దందాలు చేస్తున్నారు. దుర్గగుడిలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా.. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. దేవస్థానం వారు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు.

indrakeeladri
ఇంద్రకీలాద్రి
author img

By

Published : Jan 23, 2021, 12:31 PM IST

  • కొద్దికాలం కిందట దుర్గగుడికి చెందిన ఓ ఉద్యోగి దర్శనం టిక్కెట్లు రీసైక్లింగ్‌ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన అయ్యప్పస్వాముల బృందం వద్ద డబ్బులు తీసుకుని పాత టిక్కెట్లు ఇచ్చి దర్శనం చేయించేందుకు ప్రయత్నించాడు. భక్తులే అతడిని నిలదీసి.. అమ్మవారి సొమ్మును కాజేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు.
  • కొద్దిరోజుల కిందట హుండీ లెక్కింపు సమయంలో ఓ మహిళ రూ.70వేల నగదును దొంగతనం చేసింది. తప్పించుకుని వెళ్లిపోతుండగా సిబ్బంది చూసి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు.

ఇంద్రకీలాద్రిపై దర్శనం టిక్కెట్లను రీసైక్లింగ్‌ చేసే ఒక ముఠాను గుర్తించారు. విజయవాడ వన్‌టౌన్‌ రాజరాజేశ్వరిపేటకు చెందిన నలుగురు పాత టిక్కెట్లను భక్తులకు అమ్ముతుండగా దేవస్థానం భద్రతా సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. ముగ్గురు పారిపోయారు. ఒక్కడు దొరికాడు. దుర్గగుడిలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా.. అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఉద్యోగులు దొరికితే మందలించి వదిలేస్తున్నారు. అదే బయటవాళ్లు దొరికితే.. పోలీసులకు అప్పగించామని చెబుతున్నారు. దేవస్థానం నుంచి ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వకపోవడంతో తామేమీ చేయలేక వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. అక్రమార్కులు చెలరేగిపోవడానికి పరోక్షంగా అధికారులే ఊతం ఇస్తున్నారు. బృందాలుగా వచ్చే భక్తులతో మాట్లాడుకుని.. దర్శనాలు చేయిస్తామంటూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్న ముఠాలు ఉన్నాయి. కొందరు దేవస్థానం సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా దర్శనాలు చేయిస్తూ దండుకుంటున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే..దర్యాప్తులో దేవస్థానం సిబ్బంది హస్తం బయటపడే అవకాశం ఉంది. అందుకే.. మిన్నకుంటున్నారు.

భక్తులకు ఇచ్చే టిక్కెట్లకు సంబంధించి కౌంటర్‌ఫైల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తేలికగానే ఈ దందాను అరికట్టొచ్ఛు. ప్రస్తుతం భక్తులు తెచ్చే టిక్కెట్‌ను చింపి.. తిరిగి వాళ్లకే ఇచ్చేస్తున్నారు. ఇలాకాకుండా.. టిక్కెట్‌కు సంబంధించిన సగం ముక్కను చింపి గేటు దగ్గర ఉన్న సిబ్బంది వద్దే ఉంచుకోవాలి. మిగతా ముక్కను భక్తులకు ఇచ్చేయాలి. రెండు ముక్కలపైనా ఒకే సీరియల్‌ నంబరు ఉంటుంది. అప్పుడే.. ఎన్ని టిక్కెట్లు వచ్చాయి. వాటిలో నకిలీవి ఉన్నాయా? పాతవి మళ్లీ తెస్తున్నారా? ఇలాంటివన్నీ తెలిసిపోతాయి. కానీ.. అధికారులు కౌంటర్‌ ఫైల్‌ను భద్రపరిచే ఏర్పాటు చేయడం లేదు.

గాడితప్పిన పరిపాలన విభాగం..

ప్రధాన ఆలయం వద్ద విధులు నిర్వహించే సిబ్బందిని చాలా కాలంగా మార్చకుండా ఒకేచోట ఉంచడం కూడా పాతటిక్కెట్ల పునర్వినియోగానికి ఊతం ఇస్తోందనే ఆరోపణలున్నాయి. దుర్గగుడిలోని కొన్ని కీలకమైన ప్రదేశాల్లో విధుల కోసం సిబ్బంది పోటీపడుతుంటారు. వాటిలో టిక్కెట్లను తనిఖీ చేసే ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ విధులు నిర్వహించే వారికి అదనపు ఆదాయం ఉంటుంది. అందుకే ఇక్కడ విధుల్లో తమను ఉంచేందుకు దేవస్థానం పరిపాలన విభాగంలోని కొందరు అధికారులకు డబ్బులు ఇచ్చి మరీ సిబ్బంది పాగా వేస్తుంటారు. టిక్కెట్లను పునర్వినియోగిస్తున్న ముఠాలతో వీరికి సంబంధాలు ఉంటాయి. వాళ్లు తీసుకొచ్చే ప్రతి భక్తుడికి సంబంధించి వీరి వాటా వచ్చేస్తుందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దేవస్థానంలోని పరిపాలన విభాగంలోనూ చాలా కాలంగా కొందరే సిబ్బంది పాతుకుపోయి ఉన్నారు. వాళ్లకు ఎక్కడ ఎవరిని విధుల్లో ఉంచితే.. ఎంత వస్తుందనే లెక్కలు బాగా తెలుసనే విమర్శలున్నాయి. ఈ రెండింటిపైనా ప్రస్తుతం దృష్టిసారిస్తే.. దేవస్థానం ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు వీలుంటుంది.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.