ETV Bharat / state

పేదల బియ్యంలో అవినీతి పురుగులు - machilipatnam krishna district news update

రీసైక్లింగ్‌తో అడ్డగోలు వ్యాపారం చేసుకుంటూ రైస్ మిల్లర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. నిరుపేదలకు ఇచ్చే బియ్యం దారి మల్లుతున్న లంచాల మత్తులో నిస్సిగ్గుగా అధికారులు కళ్లకు గంతలు కట్టుకుంటున్నారు. భూమి గుండ్రంగా ఉన్నట్లు బియ్యం కూడా అలాగే తిరుగుతూ అధిక రేట్లకు అక్కడికే వస్తున్నారు. ఈ క్రమంలో కోట్లలోనే అధికారులు వెనకేసుకుంటున్నారనేది వినికిడి.

Ration rice recycling
రేషన్ బియ్యం రీసైక్లింగ్
author img

By

Published : Oct 1, 2020, 8:01 AM IST

లంచాలతో అధికారుల కళ్లకు గంతలు

మచిలీపట్నం సమీపంలోనే ఒక రైస్‌ మిల్లులో నిరుపేదలకు పంచాల్సిన చౌక బియ్యం రీసైక్లింగ్‌ (మరోసారి పాలిషింగ్‌) చేస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అక్కడ 305 కింటాళ్ల బియ్యం లభ్యమయ్యాయి. అవి రేషన్‌ బియ్యంగానే గుర్తించారు. మచిలీపట్నంలోనే మరో రైస్‌ మిల్లులో 160 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు.

పెనమలూరు ప్రాంతంలో రైస్‌ ట్రేడర్స్‌ పేరుతో మిల్లు ఉంది. దీని యజమానికి బంధువు ఒక పోలీసు శాఖలో సీఐ. ఇదే నియోజకవర్గంలో మరో మిల్లు ఉంది. అక్కడ కూడా చౌక బియ్యం రీసైక్లింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ రెండు మిల్లులపై ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునేవారు లేరు...

టీఏ బియ్యం నాణ్యతను పరిశీలించాల్సి ఉంటుంది. ముక్క, రంగు మారిన, నూకల శాతం పరిమితిని బట్టి అనుమతిస్తారు. లేదా తిరస్కరిస్తారు. దీనికి లంచాల రూపంలో రూ.50వేలు(కన్‌సైన్‌మెంట్‌కు) ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. రూ.కోట్లలోనే లంచాలు ఉంటున్నాయని వ్యాపారులే చెబుతున్నారు. ఒక్క రైస్‌మిల్లు ఏడాదికి 200 వరకు కన్‌సైన్‌మెంట్‌లు సరఫరా చేస్తే.. ఒక్కదానికి రూ.8లక్షల చొప్పున రూ.16కోట్లు మిగులు ఉంటుంది. దీనిలో 10శాతం వరకు లంచాలు ఇస్తున్నట్లు తెలిసింది.

భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లు చౌకబియ్యం కూడా అలాగే తిరుగుతున్నాయి. నిరుపేదలకు పంచే బియ్యం తిరిగి మిల్లులకు చేరి పాలిష్‌ చేసుకుని మళ్లీ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు, భారత ఆహార సంస్థకు చేరుతోంది. ఈ ప్రయాణంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. చిరుద్యోగులు సైతం రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఉయ్యూరు నియోజకవర్గంలో కొన్ని ధాన్యం మిల్లులు దీన్నే వ్యాపారంగా పెట్టుకున్నాయి. కొంతమంది కనీసం పాలిష్‌ కూడా చేయకుండానే సంచులు మార్చి మళ్లీ పౌరసరఫరాల సంస్థకు అప్పగిస్తున్నారు.

ఇలా జరుగుతోంది..!

పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, ఆడించి తిరిగి బియ్యం అందించడం జరుగుతున్న తంతు. ధాన్యం మిల్లుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయడం మరో ప్రక్రియ. సీఎంఆర్‌ బియ్యం ఆడించినందుకు ఛార్జీలు చెల్లిస్తారు. ట్రేడింగ్‌ మిల్లులను ఎంపిక చేసి ఈ విధంగా ఇస్తారు. అయితే సీఎంఆర్‌ బియ్యం బయట మార్కెట్‌లో అమ్ముకుని సీఎంఆర్‌ కింద రీసైక్లింగ్‌ బియ్యం సరఫరా చేస్తుంటారు.

* నిబంధన ప్రకారం వ్యాపారం చేసే మిల్లులకు ఒక కన్‌సైన్‌మెంట్‌ (290 కింటాళ్లు)కు నికరం రూ.15వేల వరకు ఆదాయం ఉంటుంది. కానీ ఈ బియ్యం బదులుగా రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ ద్వారా సరఫరా చేస్తే దాదాపు రూ.8లక్షల వరకు మిగులు తుంది.

* జిల్లాలో 25శాతం మిల్లులు ఇదే వ్యాపారంతో పనిచేస్తున్నాయి. ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్‌ సిబ్బందితో కుమ్ముక్కై ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ మిల్లులు తప్ప మిగిలిన వారు సరఫరా చేస్తే మాత్రం తిరస్కరిస్తారు. రేషన్‌ బియ్యం కేజీ రూ.8 నుంచి రూ.10 వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిని తిరిగి పౌరసరఫరాల సంస్థకే రూ.27.60 వరకు విక్రయిస్తున్నారు. ఉయ్యూరు ప్రాంతంలో ఓ గోదాము ఉంది. ఇక్కడ సాంకేతిక సహాయకుడు (టీఏ) ఇలాంటి రీసైక్లింగ్‌ బియ్యం సరఫరా చేసిన మిల్లరు నుంచి ఒక కన్‌సైన్‌మెంటుకు రూ.50వేలు లంచం తీసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 10 మిల్లుల వరకు సరఫరా చేస్తున్నాయి. 2వేల కన్‌సైన్‌మెంటులు సరఫరా అవుతాయి.

* ఈ విధంగా జిల్లాలో దాదాపు 50 మిల్లుల వరకు పనిచేస్తున్నాయని తెలిసింది. వీరు ఏడాదికి రూ.180కోట్లు అక్రమంగా సంపాదించినట్లు అంచనా.

* జిల్లాలో నెలకు 1.66లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కార్డు దారులకు సరఫరా చేయాల్సి ఉంది. మార్చిలో కరోనా వచ్చిన తర్వాత కేంద్రం కూడా బియ్యం ఉచితంగా అందిస్తోంది. నెలకు రెండు కోటాలు వస్తున్నాయి. అంటే దాదాపు 3.32లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. సాధారణంగా రేషన్‌ బియ్యం జిల్లాలో తక్కువ శాతం వినియోగం ఉంది. దీంతో మిల్లర్లు వీటిని తక్కువ ధరకే కొనుగోలు చేసి తిరిగి కార్పొరేషన్‌కే విక్రయిస్తున్నారు.

వేలాది టన్నులు..!

మరోవైపు వేలాది టన్నుల బియ్యం పట్టుబడుతోంది. నూజివీడులో ఏకంగా ఎల్‌ఎస్‌పీ నుంచి వెళుతున్న 10లారీలను పట్టుకున్నారు. నందిగామ, కంచికచర్లలో వందల టన్నుల బియ్యం ఇటీవల పట్టుకున్నారు. చందర్లపాడులో ఒక లారీని పట్టుకున్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలోనూ రీసైక్లింగ్‌ జరుగుతోంది. . అడ్డదారిలో వ్యాపారం చేస్తున్న మిల్లర్లతో నిజాయితీగా వ్యాపారం చేసేవారు తట్టుకోలేకపోతున్నారు. రీసైక్లింగ్‌ చేయడం వల్ల బియ్యంలో ఉండే పోషక విలువలు తగ్గిపోనున్నాయి. బియ్యం గింజపై ఉండే పొట్టు తగ్గి బివిటమిన్‌ కోల్పోతుంది. ఏది రేషన్‌ బియ్యం.. ఏది ఇతర బియ్యం అని గుర్తించే సాంకేతికత లేకపోవడం అక్రమార్కులకు కలసి వస్తోంది. . నిఘా పెంచి రేషన్‌ బియ్యం తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎస్‌వో మోహనరావు చెప్పారు.

ఇవీ చూడండి...

సందర్శకుల అందుబాటులోకి బాపు మ్యూజియం : వాణిమోహన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.