కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సచివాలయం-2 వద్ద స్థానికులు ఇళ్ల పట్టాల కోసం నిరసన వ్యక్తంచేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అర్హత ఉన్నా పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మాగంటి వెంకటేశ్వరావు అన్నారు. లేని పక్షంలో నిరసన కొనసాగిస్తామన్నారు.
ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్‌పై విచారణ వాయిదా