కనకదుర్గమ్మ సన్నిధిలో అదానీ సతీమణి - adhani wife visit vijayawada durga temple
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి అదానీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈవో సురేష్ బాబు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రీతి అదానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ పండితులు, అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి చీర, తీర్థ ప్రసాదాలు, చిత్రపటం బహూకరించి ఆశీర్వదించారు.
కనకదుర్గమ్మను దర్శించుకున్న అదానీ సతీమణి ప్రీతి అదానీ
.
sample description