An innovation To Eradicate Cannabis in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సారా, గంజాయి లేని రాష్ట్రంగా మార్చేందుకు ఈ నెల 29న నవోదయం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని జెర్రిపోతుల పాలెం ఐఎంఎఫ్ఎల్ మద్యం డిపో-2ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సారా, గంజాయి తయారీ, అమ్మకాలు ఎక్కడ జరిగినా దాడులు నిర్వహిస్తామని తెలిపారు.
6 రకాల పరీక్షలు: ప్రస్తుతం 6 రకాల పరీక్షలు జరిగిన తర్వాతే మద్యం నిల్వలు బయటకు పంపిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పాల్గొన్నారు. అక్రమ మద్యం తాగడం మూలంగా రాష్ట్రంలోని అనేక మంది అనారోగ్యపాలయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గతంలో అందుబాటులో ఉన్న మద్యం ధరల కారణంగా చాలా మంది యువత గంజాయికి అలవాటుపడ్డారని తెలిపారు.
''అక్రమ మద్యం తాగడం మూలంగా రాష్ట్రంలోని అనేక మంది అనారోగ్యపాలయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గతంలో మద్యం అందుబాటులో లేని కారణంగా చాలా మంది యువత గంజాయికి అలవాటుపడ్డారు. గంజాయి నిర్మూలనకు ఈనెల 29న నవోదయం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీని ద్వారా సంపూర్ణంగా గంజాయి లేకుండా చేయడమే లక్ష్యం''- కొల్లు రవీంద్ర,ఆబ్కారీశాఖ మంత్రి
బల్బులో డ్రగ్స్ - బెంగళూరు టు హైదరాబాద్ వయా గుంటూరు
ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
గంజాయి అడ్డుకట్టకు 'ఈగల్' - 1972టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్న సీఎం : హోంమంత్రి అనిత