భావి తరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ విజయవాడలో తెలిపారు. విభజన హామీలు అమలు చేసేలా కేంద్రాన్ని కోరాల్సిన విషయాన్ని జగన్ మర్చిపోతున్నారన్నారు. కీలకమైన అంశాలను కేంద్రమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్దామంటే.. అపాయింట్మెంట్ లేదంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వంపై జగన్ ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చలసాని తెలిపారు. విభజన హామీలు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి