కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు, నర్సులకు అందించేందుకు వెయ్యి పీపీఈ కిట్లను సోషల్ సర్వీస్ సెంటర్ డైరక్టర్ పి థామస్.. కృష్ణా జిల్లా కలెక్టర్కు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను, ప్రజలను ఆదుకోవడంలో సోషల్ సర్వీస్ సెంటర్ ముందుంటుందని ఆ సంస్థ డైరక్టర్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కోవిడ్-19 బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి 8 లక్షల రూపాయల విలువ చేసే వెయ్యి పీపీఈ కిట్లను అందించామన్నారు. ఈ పీపీఈ కిట్లలో హజ్మత్ సూట్ , ఒక జత సర్జికల్, ఫేస్ మాస్క్, గాగుల్స్, ఒక జత ఫుట్ కవర్స్, హెడ్ కవర్లు ఉన్నాయన్నారు. కిట్లను అందజేసిన సంస్థ ప్రతినిధులను కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు