రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జోరందుకుంటోంది. ఘర్షణలతో ఉదయం కాస్త మందకొడిగా జరిగిన పోలింగ్.. మధ్యాహ్నానికి ఊపందుకుంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 54 ఓటింగ్ నమోదైంది. ఉదయం ఈవీఎంలు పనిచేయక వెనక్కి వెళ్లిన ఓటర్లు మళ్లీ.. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలారు. ఎంత రద్దీ ఉన్నా ఓటు వేశాకే తిరిగి వెళ్తామని వృద్ధులు, మహిళా ఓటర్లు ఉత్సాహంగా చెబుతున్నారు.
సాయంత్రం ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని ఎంత సేపైనా ఓటు వేయడానికి అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పోలింగ్ ముగిసే సరికి ఓటింగ్ శాతం సంతృప్తికరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా | పోలింగ్ శాతం |
అనంతపురం | 54.96 |
శ్రీకాకుళం | 52.11 |
విజయనగరం | 62.30 |
విశాఖపట్నం | 45.79 |
కృష్ణా | 52.53 |
గుంటూరు | 49.2 |
తూర్పు గోదావరి | 57.32 |
పశ్చిమ గోదావరి | 55.67 |
ప్రకాశం | 56 |
నెల్లూరు | 56.25 |
చిత్తూరు | 57.60 |
కడప | 56.44 |
కర్నూలు | 46 |
ఇదీ చదవండి