కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారు వీఎన్ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ ఈస్ట్ ఏసీపీ విజయ్ పాల్ ఆధ్వర్యంలో సీఐ శివాజీ బృందం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కాలనీలో ఆకతాయిలను అదుపు చేయటంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
నివాసితులు, వారి వాహనాలు, వృత్తి సంబంధిత వివరాలు సేకరించారు. పలువురు అనుమానితులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలు, నేరాలకు పాల్పడితే.. ఉపేక్షించేది లేదని ఏసీపీ విజయ్ పాల్ వెల్లడించారు.