ETV Bharat / state

ముగ్గురు అంతర్‌జిల్లా దొంగల అరెస్టు - nandigama news

దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌జిల్లా దొంగలను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు, సీసీఎస్‌ పోలీసలు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి లక్షా 64వేల రూపాయల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

krishna distrct
ముగ్గురు అంతర్‌జిల్లాల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Jun 10, 2020, 6:52 PM IST

కృష్ణాజిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌జిల్లాల దొంగలను నందిగామ పోలీసులు, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగామ మండలం పెద్దవరం గ్రామంలోని శివాలయం, చెన్నకేశవస్వామి దేవాలయాల్లో చోరీకి పాల్పడి బంగారు నక్లెస్‌లు, రెండు పట్టు వస్త్రాలు, వెండి ఆభరణాలను చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిందితులు బి.లింగయ్య, రాచకొండ వెంకన్న, ఎం.శ్రీనులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వీరే కంచికచర్ల మండలం మున్నలూరు, చందర్లపాడు మండలం కాసరబాద, వత్సవాయి మండలం కొత్తపేట, నందిగామ పట్టణంలోని చందమామపేట దేవాలయాల్లోనూ చోరీకి పాల్పడ్డారని అన్నారు. ఈ చోరీలకు సంబంధించి సొత్తును రికవరీ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నందిగామ సీఐ కనకారావు, సీసీఎస్‌ సీఐ సుబ్బారావు, ఎస్సై ఏసోబు పాల్గొన్నారు.

ఇది చదవండి రోడ్డు మీద లారీ డ్రైవర్ల ఘర్షణ.. నిలిచిన ట్రాఫిక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.