మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఎక్కువగా చెట్లను పెంచుతూ పచ్చదనాన్ని నింపితే....మనకు ఆహ్లాదమే కాదు మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. ముఖ్యంగా చెట్ల ద్వారా సహజసిద్ధంగా లభించే ప్రాణవాయువు మనిషి మనుగడకు ఎంతో కీలకం. తులసి మొక్క ద్వారా ఆక్సిజన్ లభిస్తుందనే ప్రతి ఇంటిలోనూ ఆ మొక్కను పెంచాలని చెబుతూ ఉంటారు. తులసి తర్వాత ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేసే చెట్టుగా రావికి గుర్తింపు ఉంది. రాత్రి సమయాల్లోనూ కార్భన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేయడం ఈ చెట్టు ప్రత్యేకత. పురాణాల్లోనూ రావి చెట్టు ప్రాముఖ్యత గురించి చెప్పారు. భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని ఓ శ్లోకంలో రావి చెట్టును భగవంతుని ప్రతిరూపంగా వర్ణించారు. సూర్యుని కిరణాలలో ఎంతటి జీవశక్తి దాగి ఉందో.. అలాగే రవికి ప్రతిరూపంగా భూమిపై ఆవిర్భవించిన రావి చెట్టుకు అంతే శక్తి ఉందని విశ్వాసం. జీవ కోటికి ప్రాణవాయువును నిరంతరం అందిస్తూ ఉంటుంది. రావి చెట్టులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఔషధాలల్లో రావి చెట్టు ఆకులు, కాయలు, బెరడును వాడుతున్నారు. కరోనా కాలంలో ఈచెట్టు గాలిని పీల్చుకుంటే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
కృష్ణా జిల్లా మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో నీరు చెట్టు పథకంలో భాగంగా నాటిన రావి చెట్టు ఎంతో సత్ఫలితాలనిస్తోంది. రోజు వందల మంది దాని కింద సేద తీరుతున్నారు. ఎంతో మందికి ఆక్సిజన్‌ను ఇస్తూ ఉపయోగపడుతోంది. ఇక్కడి సిబ్బంది ఈ చెట్టు కిందనే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. వేలాది పక్షులు ఈ చెట్టుపై వాలి కిలకిల రావాలతో సందడి చేస్తాయి.
ఉత్తరప్రదేశ్‌లోని తిల్‌హర్ పట్టణంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో పడల్లేక.. రావి చెట్టు కింద ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందని.. అక్కడే ఏర్పాట్లు చేసుకున్నారు.
పెద్దఎత్తున డబ్బులు చెల్లించి ప్రాణ వాయువును కొనే పరిస్థితుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ...ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడే బాధ్యతను తలకెత్తుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: