అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ విద్యనందిస్తామని సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కృష్ణాజిల్లా సుల్తానగరంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న మంత్రి నాని... ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు విద్య అందనంత ఎత్తులో ఉందన్నారు. పేదవారు ఆర్థిక ఇబ్బందులతో తమ పిల్లలను చదివించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని అన్నారు. ఇకపై ఏ ఒక్కరికి విద్య భారం కాకూడదనే ఉద్దేశంతో... ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఏడాదికి రూ.15వేలు నగదు సాయం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ...