కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆయన భార్యకు పాజిటివ్ రాగా... ఆమె విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనిల్.. గత కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
తాజాగా... ఆయనకు కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. తనను కలవటానికి ఎవ్వరూ రావద్దని, ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానని నియోజకవర్గ ప్రజలకు అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
అప్పు తీర్చమన్న భర్తను చంపేశారు... కేసు పెట్టిన భార్యను కొట్టించారు...!