ETV Bharat / state

మేమింతే - సెకి డీల్​పై జగన్‌ ప్రభుత్వ వింత వాదన!

సౌరవిద్యుత్‌పై జగన్‌ ప్రభుత్వ వింత వాదన - ఒప్పందాన్ని సమర్థించుకోవడానికి డిమాండ్‌పై కాకిలెక్కలు

Adani Bribery Case
Adani Bribery Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 20 hours ago

Adani Bribe to YS Jagan : సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా - సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నాటి వైఎస్సార్సీపీ పెద్దలిచ్చిన ఆదేశాల ప్రకారం ఏపీ పవర్‌ కోఆర్డినేషన్‌ కమిటీ-(ఏపీపీసీసీ) అడ్డగోలు లెక్కలు తయారు చేసింది. అసలు సెకి నుంచి వచ్చే కరెంట్ రాష్ట్రానికి అవసరమా? లేదా? అనే విషయాన్ని పక్కనపెట్టి, సెకి విద్యుత్‌ను ఎట్టిపరిస్థితుల్లో కొనాలనే లక్ష్యానికి వీలుగా డిమాండ్, సప్లై నివేదిక రూపొందించింది.

ఒప్పందం కోసమే విద్యుత్‌ డిమాండ్‌ లెక్కలు : 2024-25 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ను 82,253 మిలియన్‌ యూనిట్లుగా ఏపీపీసీసీ అంచనా వేసింది. వివిధ విద్యుత్‌ ఒప్పందాల ద్వారా 56,315 మిలియన్‌ యూనిట్లు, మరో 15,942 మిలియన్ యూనిట్ల పునరుత్పాదక కరెంట్ అందుతుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచి సెకి ద్వారా 7286 మిలియన్‌ యూనిట్లు వచ్చినా ఇంకా 2710 మిలియన్‌ యూనిట్ల లోటు ఉంటుందని లెక్కగట్టింది.

అదే 2025-26లో సెకి నుంచి 14,572 మిలియన్‌ యూనిట్లు తీసుకున్నా ఇంకా 1246 మిలియన్‌ యూనిట్ల లోటు ఉంటుందని ఏపీపీసీసీ తెలిపింది. 2026-27లో ఒకవేళ సెకి నుంచి 17,000ల మిలియన్‌ యూనిట్లు తీసుకున్నా 5047 మిలియన్‌ యూనిట్ల లోటు ఉంటుందంటూ కమిటీ లెక్కలు కట్టింది. ఇది ఏపీఈఆర్సీ నివేదికకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా 6 నుంచి 7 శాతానికే కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ పరిమితం అవుతుంటే జగన్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్ పవర్‌ కోఆర్డినేషన్‌ కమిటీ 8 శాతంగా పరిగణనలోకి తీసుకుని అంచానాలు రూపొందించింది. వీటీపీఎస్, ఆర్టీపీపీల్లో ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యమున్న 8 థర్మల్‌ విద్యుత్‌ యూనిట్లను 2025 మార్చి నుంచి మూతపడతాయంటూ ముందే తేల్చేసింది.

అయితే పర్యావరణ సమస్యల దృష్ట్యా 30 సంవత్సరాలు దాటిన థర్మల్‌ యూనిట్లను మూసేయాలని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో భావించినా వాటిని 2030 వరకు కొనసాగించేందుకు ఆ తర్వాత అనుమతించింది. వాటిని కనీసం 60 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌లో నిర్వహించినా ఏటా సుమారు 9000ల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. మరి అలాంటప్పుడు సెకి నుంచి కరెంట్ కొంటే దాన్ని ఏం చేయాలనే ఆలోచనే ఏపీపీసీసీ చేయలేదు. ఇక ఓపెన్‌ యాక్సెస్‌ విద్యుత్‌ లెక్కలనూ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పారిశ్రామిక వినియోగదారులు పగటి వేళల్లో తక్కువ ధరకు దొరికే సౌర విద్యుత్‌ను ప్రైవేట్ డెవలపర్ల నుంచి కొనుక్కునే వెసులుబాటను కేంద్రం కల్పిస్తోంది.

Adani Bribery Case Updates : రాష్ట్రంలో అప్పటికే ఓపెన్‌ యాక్సెస్‌లో సుమారు 400 మిలియన్ యూనిట్లు వినియోగిస్తుండగా భవిష్యత్​లో అది మరింత పెరుగుతుందని అంచనా. ఆ మేరకు డిస్కంల దగ్గర విద్యుత్‌ మిగులిపోతుంది. సెకి నుంచి కూడా తీసుకుంటే ఆ మిగులు మరింత పెరుగుతుంది. పగటి వేళల్లో మిగిలే విద్యుత్​ను మార్కెట్‌లో విక్రయించేందుకు గతంలో డిస్కంలు ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో యూనిట్‌ 50 పైసలకు కూడా అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. అంటే ఎక్కువ ధర పెట్టి కొన్న కరెంట్​ను తక్కువకు అమ్ముకోవాల్సిందే. నాటి సీఎం జగన్ చెప్తున్నట్లు అది సంపద సృష్టించినట్లు ఎలా అవుతుంది?

ప్రస్తుతం పగటి వేళల్లో విద్యుత్ డిమాండ్‌ తక్కువగా ఉండటంతో సుమారు 3000ల మెగావాట్ల కరెంట్ మిగులు ఉంటోంది. గ్రిడ్‌కు సుమారు 14,000ల మెగావాట్ల కరెంట్ అందుతోంది. వేసవిలో మినహా మిగిలిన సీజన్లలో పగటి డిమాండ్‌ 8000ల నుంచి 9000ల మెగావాట్లకు మించడం లేదు. సెకి విద్యుత్‌ అందేదీ పగటివేళలోనే. దానివల్ల మిగులు మరింతగా పెరగనుంది. ఆ కారణంగా జెన్‌కో థర్మల్‌ యూనిట్లను బ్యాక్‌డౌన్‌ చేయాల్సి వస్తోంది.

ఒకవేళ రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ చేసినా రాబోయే ఏడేళ్లలో సుమారు 33,300ల మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉంటుందని ఏపీఈఆర్సీ అంచనా వేసింది. సెకితో జగన్‌ ప్రభుత్వం యూనిట్‌ రూ.2.49 చొప్పున కుదుర్చుకున్న ప్రకారం లెక్కించినా ఆ మొత్తం రూ.8291కోట్లు. ఇతర రుసుములు కలిపి యూనిట్‌కు రూ.5.10 వంతున లెక్కించినా ఏడు సంవత్సరాల్లో రూ.16,983 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇదంతా తెలిసి ఏపీఈఆర్సీ సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతించడం విడ్డూరమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సెకి ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్‌ - జగన్ అవినీతికి ఇవే సాక్ష్యాలు!

అసలు ఒప్పందం అదానీతోనే! - ఈ అనుబంధ ఒప్పందాలే నిదర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.