రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 4,257 మంది చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. వీరిలో 3,622 మంది బాలలు, 635 మంది బాలికలు ఉన్నారు. వీరికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 12 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనా సోకిన చిన్నారులను కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.