ETV Bharat / state

నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి - కృష్ణా జిల్లాలో బాపులపాడులో చిన్నారి మృతి వార్తలు

బుడిబుడి అడుగులతో ఇల్లాంత కలియతిరిగే ఆ చిన్నారి అంతలోనే విగతజీవిగా కనిపించే సరికి ఆ తల్లిదండ్రులకు నోటమాటరాలేదు. అల్లరుముద్దుగా తన చేష్టాలతో అందరిని కడుపుబ్బా నవ్వించే ఆ పాప ఇకలేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు.

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
author img

By

Published : Jun 14, 2020, 10:32 PM IST

రోజులాగే తన బిడ్డ ఆడుకుంటుందనే భ్రమలో ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఉన్నంటుండి ఏమైందో తెలియదు.... అంతా నిశ్శబ్దం. బయటికి వచ్చేసరికి తమ ముద్దుల చిన్నారి నీటితొట్టెలో విగతజీవిగా కనిపించేసరికి వారి రోధనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో పెరికీడు గ్రామంలో జరిగింది.

కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే మల్లవల్లీ ప్రకాష్​కి ఇద్దరు పిల్లలు. మూడేళ్ల బాబు, ఏడాదిన్నర పాప. రోజు మాదిరిగా సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో చిన్నారి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడింది. చిన్నారిని ఎవరు చూడకపోవటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై మదీనా బాషా.... తల్లిదండ్రులు నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.

ఇవీ చదవండి

ఆటోను ఢీకొట్టిన ఐచర్ వాహనం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.