చనిపోయిందనుకున్న వృద్ధురాలు.. తిరిగి ఇంటికి రావడం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసులను విస్తుపోయేలా చేసింది. క్రిస్టియన్‌పేటకు చెందిన గిరిజమ్మకు కరోనా సోకటంతో.. మే 12న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. 15వ తేదీన ఆమె భర్త అక్కడికి వెళ్లి చూడగా కనిపించలేదు. సిబ్బందిని అడిగితే అన్ని వార్డుల్లో చూడమన్నారని.. ఎక్కడా కనపడక మార్చురీలోనూ వెతికాారు. అక్కడ వేరే మృతదేహాన్ని చూసి తన భార్యేనని అతను నిర్ధరించటంతో ఆసుపత్రి వర్గాలు ధ్రువపత్రం ఇచ్చి పంపేశారు. కుటుంబసభ్యులు అంత్యక్రియలూ పూర్తి చేశారు.
గిరిజమ్మ కుమారుడు గత నెల 23న కరోనాతో కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ నిన్న పెద్దకర్మ చేశారు. ఆసుపత్రిలో ఉంటూనే కరోనా నుంచి కోలుకున్న గిరిజమ్మ.. తనంతట తానుగా ఇంటికి చేరుకునేసరికి అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు.
ఇదీ చదవండి