వీఆర్వోతో కుమ్మక్కై కొందరు వ్యక్తులు తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మెట్లపల్లి పోతురాజు అనే వృద్ధ రైతు ఆందోళనకు దిగారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని తన స్థలానికి.. దొంగ పట్టాలు సృష్టించారని ఆరోపించారు. అధికారులే అన్యాయం చేస్తుంటే.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.
ఏపీఐఐసీ భూసేకరణలో వచ్చే పరిహారం కోసం అధికారులు ఈ తరహా ఎత్తులు వేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆ వృద్ధ రైతుకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఓవైపు చెట్ల తొలగింపు.. మరోవైపు ఉద్యానవనం