కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కృష్ణమోహన్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ... పదవీ విరమణ పొందారు. తన పదహారేళ్ల వయసు నుంచి ప్రపంచంలో వాడిన పురాతన నాణేలు సేకరించే పనిలో పడ్డారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం వాడిన నాణేలతో పాటు స్వాతంత్రం వచ్చిన తరువాత మనదేశంలో వాడిన నాణాలు సేకరించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. భావితరాలకు పురాతన నాణేల విశిష్టత తెలిపేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానని కృష్ణమోహన్ తెలిపారు.
ఇదీ చదవండి: ' జగనన్నా.. మమ్మల్ని అమ్మేశారు..కాపాడన్నా'