మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై రాళ్ల దాడి ఘటనలో పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని కృష్ణాజిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దేవినేని ఉమా కారులోనుంచి దిగకుండా ఇబ్బంది పెట్టేలా ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు తలెత్తేలా వ్యవహరించారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వర్గాలను రెచ్చగొట్టేలా దేవినేని ఉమా వ్యవహరించడంతో ఆయన పై కేసులు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
ఘర్షణలకు దిగిన ఇరుపార్టీల కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఒక వర్గంలో 18 మందిపై మరో వర్గంలో ఆరుగురు వ్యక్తులపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారని.. పూర్తి వివరాలను సమగ్ర దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: