కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కు మద్దతుగా అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ ను మూసివేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాని సూచనల మేరకు ఎన్టీఆర్ భవన్‌కు సందర్శకులు, కార్యకర్తలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యాలయ సిబ్బంది సైతం ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ప్రజా శ్రేయస్సు కోసం తెదేపా ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుందని ఆ పార్టీ అధినేత పేర్కొన్నారు.
ఇదీ చదవండి.