కాపు సంక్షేమం గురించి జగన్ రెడ్డి మాట్లాడటం.. రావణాసుడు రామాయణం చెప్పినట్లుగా ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1.5 కోట్ల మంది కాపులు ఉన్నారని అసెంబ్లీలో ప్రకటించిన జగన్.. కేవలం 3 లక్షల మందికి కాపు నేస్తం అందించటం మోసం కాదా అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2వేల కోట్ల చొప్పున 5ఏళ్లలో రూ.10వేల కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారని మండిపడ్డారు.
పేదలందరికీ ఇచ్చే అమ్మఒడి, భరోసా, రేషన్, ఫించన్లను కూడా కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు బలోపేతం చేసిన కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డికి.. కాపుల పేరు ఉచ్ఛరించే అర్హత కూడాలేదని విమర్శించారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్థుల సంక్షేమం కోసం తెదేపా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను జగన్ రెడ్డి రద్దు చేయటం ద్రోహం కాదా అని నిలదీశారు.
ఇదీ చదవండి:
ysr Kapu Nestam: నేడు వైఎస్సార్ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల