నందిగామ నగర పంచాయతీ కార్యాలయం పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు.. రెండు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోగా.. చిన్న పిల్లలతో సహా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పెండింగ్ వేతనాలతో పాటు ఆరు నెలల ప్రోత్సాహకాలు చెల్లించకపోతే విధులకు హాజరుకామని హెచ్చరించారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా.. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకురాలు మాణిక్యం వాపోయారు. క్రిస్మస్ సమీపిస్తున్నా వేతనాలు ఇవ్వకపోతే.. పండుగ ఎలా చేసుకోవాలి అని ప్రశ్నించారు. అక్టోబర్ నెల నుంచి చెల్లించాల్సిన వేతనాలను రెండు, మూడు రోజుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు.. నగర పంచాయతీ కమిషనర్ మల్లేశ్వరం తెలిపారు. ప్రభుత్వం పొరుగు సేవల కార్పొరేషన్ కార్మికులను అప్పగించడం వల్ల.. కొన్ని సాంకేతిక కారణాలతో జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: