కృష్ణా జిల్లా నాగాయలంక శివారు వక్కపట్ల వారిపాలెం గ్రామంలో ఓఎన్జీసీ సంస్థ.. 2018 నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ ను వెలికితీస్తోంది. ఈ నేపథ్యంలో.. తమ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వక్కపట్ల వారి పాలెం ప్రజలు సంస్థ ఉన్నతాధికారులను కలిశారు.
మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అంతర్గత రహదారులు, గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి సహకారం, నిరుద్యోగులకు ఉపాధి వంటి 14 అంశాలతో కూడిన వినతి పత్రాన్నిఅందించారు.
ఇదీ చదవండి:
పాత్రికేయుడు నవీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు... ప్రధాన ముద్దాయి వైకాపా నేతే