సొంత పార్టీ నేతలైన ఆడ్వాణీ, జోషి, కల్యాణ్ సింగ్‌లను గౌరవించుకోలేని భాజపా.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోయడం ఏమిటని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజంగా పీవీ, ఎన్టీఆర్‌లపై భాజపాకు ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈనెల 29న హైదరాబాద్ వస్తున్న అమిత్ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలన్నారు. ప్రతిరోజు రాత్రి బండి సంజయ్, అరవింద్ – అసద్, అక్బర్‌ల మధ్య ఫోన్ సంభాషణ నడుస్తోందని చెప్పారు. ఇందుకు అమిత్ షా సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాత్రి పూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకోవడం.. ఉదయం సురభి నాటకానికి తెర లేపడం జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా భాజపా ఉచ్ఛరించదని దుయ్య బట్టారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: