RRR letter: 'పట్టింపులకు పోకండి.. బోర్డు పరీక్షలు ఇప్పటికైనా రద్దు చేయండి' - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ వార్తలు
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పరీక్షల నిర్వహణ అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన అన్నారు.
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. పరీక్షల నిర్వహణ అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు చాలా అనుమానాలు లేవనెత్తిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. పట్టుదల, పంతాలు, పట్టింపులు పక్కనపెట్టాలని.. సుప్రీంకోర్టు హితవు పలికిన మేరకైనా పరీక్షలు రద్దు చేయాలని కోరారు.