ETV Bharat / state

రఘురామకృష్ణరాజుపై స్పీకర్​కు ఫిర్యాదు చేస్తా: నందిగం సురేశ్ - ఎంపీ నందిగం సురేశ్ వార్తలు

వైకాపా ఎంపీలు రఘురామకృష్ణరాజు, నందిగం సురేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రఘురామకృష్ణరాజుపై మరోసారి నందిగం సురేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై రేపు లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

mp nandigam suresh
mp nandigam suresh
author img

By

Published : Sep 21, 2020, 7:39 PM IST

దళితులను అవమానించేలా ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడారని...దీనిపై క్షమాపణ చెప్పాలని వైకాపా ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. ముక్కు నేలకు రాసి పార్లమెంట్​లో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. రఘురామపై జాతీయ ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేయాలని కోరగా... సానుకూలంగా హామీ ఇచ్చారని తెలిపారు.

తన అంగరక్షకులతో దళిత నేతనైన నన్ను కాల్చి చంపుతానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. దీనికిగాను ఆయనపై చర్యలు తీసుకోవాలని...ఆయన భధ్రతను వెంటనే తొలగించాలని మంగళవారం లోక్​సభ స్పీకర్​ను కలసి కోరతాం. దళితులు ఓట్లు వేస్తేనే రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలిచారనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయనకు బుద్ధి చెప్పేందుకు దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయి -నందిగం సురేశ్, బాపట్ల ఎంపీ

ఇదీ చదవండి

సొంత పార్టీ ఎంపీపై స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.