జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల పరిపాలనలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ వైవీ బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. కేవలం రూ.5 వేలు, రూ.10 వేలు ఇచ్చి దాన్నే అభివృద్ధి అనుకోవడం జగన్ రెడ్డి అవివేకమన్నారు. ఒక చేత్తో సంక్షేమం అంటూ డబ్బులు ఇస్తూ, దానికి రెండింతలు పన్నుల భారం ప్రజలపై వేస్తూ డబ్బులు వసూళ్లు చెయ్యడం నిజం కాదా అని ప్రశ్నించారు.
ఇసుక, మద్యం మాఫియాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తూ బినామీలకు వేల కోట్లు దోచి పెడుతున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్లపట్టాల పేరుతో ఒక సెంటు భూమి ఇస్తున్నామని చెప్పి, రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కోటాను కోట్ల రూపాయలు అక్రమంగా కట్టబెట్టారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: