గుంటూరు - కృష్ణా జిల్లాల స్వతంత్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నూతన సభ్యురాలిగా ఎంపికైన టి.కల్పలతతో శాసనమండలి ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా బాధ్యతల్లోకి వచ్చిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలికి సంబంధించి నియమనిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు - కృష్ణా జిల్లాల శాసన మండలి సభ్యురాలిగా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఉపాధ్యాయులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలలు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పని చేస్తానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: