ఇదీ చదవండి:
ఆ ఎమ్మెల్యేను కలవటానికి వెళ్తున్నారా.. పుస్తకాలు తీసుకెళ్లండి..! - పుస్తకాలు పంచిన ఎమ్యెల్యే సింహాద్రి రమేష్ బాబు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల నోట్‌బుక్స్ అయిపోతే కొత్తవి కొనుగోలు చేయటానికి తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేక... కొందరు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నోట్‌బుక్స్ కొరత లేకుండా పోయింది. ఆ విద్యార్థులకు నోట్ బుక్స్ ఎక్కడివి.. ఎలా వస్తున్నాయి.. ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారా..అయితే ఈ కథనం చదవండి మరీ..!
ఆ ఎమ్మెల్యేను కలవటానికి వెళ్తున్నారా.. పుస్తకాలు తీసుకేళ్లండి..!
ప్రజాప్రతినిధిని దగ్గరకు వెళ్ళాలి అనుకునే వారు ఒట్టి చేతులతో వెళ్ళకుండా పూలదండలు, శాలువలు, బొకేలు తీసుకెళ్తుంటారు. అవి సాయంత్రానికి పనికిరాకుండా పోతాయి. వాటిని వృథాగా చెత్తకుప్పలో పడేస్తారు. ఇదంతా చూసిన ఆయనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే పూల దండలు వేసుకోవడం మానేశారు. ఎందుకలా చేశారు అని అనిపిస్తుంది కదూ..! ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలనే సంకల్పం ఆయనది... తనను కలవటానికి వచ్చిన వారితోపాటు తను కలవాల్సిన సందర్భంలో ఇంకొకరికి ఉపయోగపడాలనే ఓ చిన్ని స్వార్ధం ఆయనది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి బొకేలకు బదులుగా నోట్‌బుక్స్ తీసుకోవడం ప్రారంభించారు. వాటిని ప్రభుత్వ బడిలో ఉండే పేద విద్యార్థులకు పంపిణీ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పటికే సుమారు 30 ప్రభుత్వ పాఠశాలలో సుమారు పదివేల నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగ్‌లు పంపిణీ చేశారు. ఇదంతా చేసింది మరెవరో కాదు.. కృష్ణా జిల్లా అవనిగడ్డ శాశనసభ్యులు సింహాద్రి రమేశ్‌బాబు. నోట్స్‌బుక్స్ మాత్రమే కాకుండా మొక్కలు బహుమతిగా ఇవ్వడం.. వాటిని రోడ్డు పక్కన నాటడం అలవాటుగా మారింది. నూతన సంవత్సరం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చే వాళ్ళు సుమారు వెయ్యి వరకు నోట్ పుస్తకాలు, వెయ్యి వరకు పెన్నులు, బ్యాగ్స్ తేవడంతో వాటన్నింటిని అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేశారు. ఇలా పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం వలన తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులంటున్నారు. అందరూ ఈ విధానాన్నే అనుసరిస్తే... తమ లాంటి పాఠశాల పిల్లలకు నోట్‌బుక్స్ కొరతే ఉండదని ఉపాధ్యాయులు తెలిపారు. మంచి పనిని మనమూ ప్రోత్సహిద్దాం.. అనుసరిద్దాం అనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి:
Intro:ap_vja_42_01_bokaybadhulu_books_vo_ap10044
వాయిస్ ఓవర్ చేసి రెడీ టు పబ్లిష్ మోడ్ లో పంపిన స్టోరీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులు రాసుకునే నోట్ బుక్స్ అయిపోతే కొత్తవి కొనుగోలు చేయటానికి తల్లితండ్రుల ఆర్ధిక స్థోమత లేక కొందరు విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు నోట్ బుక్స్ కొరత లేకుండా పోయింది. విద్యార్ధులకు నోట్ బుక్స్ ఎక్కడివి విద్యార్ధులకు ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారా
ప్రజా ప్రతినిధిని దగ్గరకు వెళ్ళాలి అనుకునే వారు ఒట్టి చేతులతో వెళ్ళకుండా పూలదండలు, శాలువలు, బొకేలు ఇచ్చేవాళ్ళు తరువాత అవి సాయంత్రానికి పనికిరాకుండా పోయేవి వాటిని వృధాగా చెత్తకుప్పలో పడవేసేవారు ఇదంతా చూసిన ఆయనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది ఎన్నికల్లో గెలిచిన నాటి నుండే పూల దండలు వేసుకోవడం మానివేసారు.
తాను ఎ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలనే సంకల్పం ఆయనది తనను కలవటానికి వచ్చిన వారితో పాటు కలసిన సందర్బం కూడా ఇంకొకరికి ఉపయోగ పడాలనే సంకల్పంతో ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి బోకేలకు బదులు నోట్ బుక్స్ తీసుకోవడం వాటిని ప్రభుత్వ స్కూల్ నందు పేద విద్యార్ధులకు పంపిణి చేయడం అలవాటుగా మారింది. ఇప్పటికే సుమారు 30 ప్రభుత్వ స్కూల్స్ నందు సుమారు పదివేల నోట్ బుక్స్ మరియు పెన్నులు మరియు బ్యాగ్ లు విద్యార్ధులకు పంపిణి చేసారు అవనిగడ్డ శాశనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు. ఒక్క నోట్స్ బుక్స్ కాకుండా మొక్కలు కూడా బహుమతిగా ఇవ్వడం వాటిని రోడ్డు ప్రక్కన నాటడం అలవాటుగా మారింది.
ఈరోజు నూతన సంవత్సరం సందర్బంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చే వాళ్ళు సుమారు వెయ్యి వరకు నోట్ పుస్తకాలు, వెయ్యి వరకు పెన్నులు, బ్యాగ్స్ తేవడం వాటిని ఈరోజు అవనిగడ్డ ప్రభుత్వ పాటశాలలో పంపిణి చేసారు. ఇలా బుక్స్ పెన్నులు ఇవ్వడం వలన అవి తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అందరూ ఈ విధానం ఆశరించితే తమకు నోట్ బుక్స్ కొరతే ఉండదని విద్యార్ధులు, ఉపాధ్యాయులు తెలిపారు.
వాయిస్ బైట్స్
అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యుడు - సింహాద్రి రమేష్ బాబు
కడవకొల్లు నరసింహారావు
తూము వెంకటేశ్వరరావు
అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు
అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు
Body:వాయిస్ ఓవర్ చేసి రెడీ టు పబ్లిష్ మోడ్ లో పంపిన స్టోరీ
Conclusion:వాయిస్ ఓవర్ చేసి రెడీ టు పబ్లిష్ మోడ్ లో పంపిన స్టోరీ