విజయవాడలో దసరా మహోత్సవ ఏర్పాట్లను దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జేసీ మాధవీలత, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. దసరా ఉత్సవాలను ఘనంగా చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. విజయవాడలో జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల వలన ఉత్సవాలకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ