విజయవాడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంత్రుల ప్రచారాలు, విమర్శలు, అసమ్మతి, బుజ్జగింపులు, ప్రతిపక్షం నేతల అలకలతో నగరంలో ప్రచారం వాడివేడీగా సాగుతోంది. మొదటిసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైకాపా ప్రచారం జోరు పెంచింది.
తెలుగుదేశం ఎన్ని ఎత్తులు వేసినా విజయవాడ మేయర్ పీఠం తమదేనని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక తెదేపా నేతల విభేదాలను ప్రస్తావించిన ఆయన... నాయకుల వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. 6వందల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి:
'బాలకృష్ణ చిన్న పిల్లోడు... ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు'