ETV Bharat / state

ఆ మూడు పార్టీలదీ ఒకే కూటమి: మంత్రి వెల్లంపల్లి - విజయవాడలో మంత్రి వెల్లంపల్లి ప్రచారం వార్తలు

గత ప్రభుత్వం విజయవాడ అభిృద్ధిని గాలికొదిలేసిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆయన విజయవాడలో ప్రచారం చేశారు. తెదేపా, భాజపా, జనసేన ఒకే కూటమికి చెందినవని అన్నారు.

minister vellampalli srinavasarao
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
author img

By

Published : Feb 28, 2021, 2:23 PM IST

విజయవాడ నగర అభివృద్ధికి సీఎం జగన్ 600 కోట్ల రూపాయలను కేటాయించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ది ఏమీ జరగలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 41వ డివిజన్ అభ్యర్థితో క‌లిసి భవానీపురం, స్వాతీ సెంటర్, లలితానగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని... పేదలు మెచ్చిన జగనే అధికారంలోకి వస్తారని అన్నారు.

అసత్యాలను ప్రచారం చేసేవారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం ప్రభంజనాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. నగరంలోని క్యాంబే రోడ్డు, అప్నాబ‌జార్ త‌దిత‌ర ప్రాంతాల‌ను అభివృద్ది చేస్తామ‌ని ఆయన హామీ ఇచ్చారు. తెదేపా, భాజపా, జనసేన ఒకే కూటమికి చెందినవి .. అన్నారు. ఈ పార్టీలు అధికారంలో ఉంటే ఒక మాదిరిగా.. లేకపోతే మ‌రో మాదిరిగా ప్రవ‌ర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

విజయనగరం నగరపాలక సంస్థలో కలిసినా.. తప్పని తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.