కొన్ని రోజులుగా కేంద్రం పెట్రోలు ధరలు పెంచుతూ ఉంటే మాట్లాడని వాళ్లంతా రాష్ట్రప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మోదీ 10 రూపాయలు పెంచితే ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు రూపాయి సెస్ వేసి రహదారులు మరమ్మతులు చేయించాలని భావిస్తే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
'ప్రధాని మోదీ ఇప్పటివరకు పెట్రోలు, డీజిల్పై రూ. 10 పెంచితే ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల కోసం రూపాయి పన్ను వేస్తే విమర్శలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే ఒక్క రూపాయి సెస్ వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇదెవరూ ఆలోచించట్లేదు'-- కొడాలి నాని, మంత్రి