తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో ఇంటర్ పాఠ్యపుస్తకాల(ap inter books news)ను ముద్రించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్(minister adimulapu suresh news) తెలిపారు. ఇంటర్ అకాడమీ పుస్తకాలను విడుదల చేసిన మంత్రి.. మొత్తం 54 టైటిళ్లతో పుస్తకాలను ముద్రించినట్లు వెల్లడించారు. తెలుగు-సంస్కృత అకాడమీ తన బ్రాండ్ ఇమేజ్ నిలుపుకుందని తెలిపారు.
పోటీపరీక్షల అభ్యర్థులకు తెలుగు అకాడమీ పుస్తకాలతో ఎంతో లబ్ధి చేకూరుతుందని మంత్రి సురేశ్ అన్నారు. తెలంగాణ నుంచి రూ.వందల కోట్లు, ఉద్యోగులు రావాల్సి ఉందన్న మంత్రి.. నిధులు, ఉద్యోగులపై ఏపీకి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలుగు అకాడమీ తిరుపతి కేంద్రంగా పూర్తిస్థాయిలో పని చేస్తుందన్నారు.
ఇదీ చదవండి
Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!